VSP: పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను విన్న అనంతరం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరించాలని సూచించారు.