ASF: చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో జుమిడి లక్ష్మి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు గురువారం చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువా పగులగొట్టి సుమారు 2.5 తులాల బంగారం, రూ.50 వేల నగదు అపహరించారు. పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చిన బాధితురాలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.