తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి కోహ్లీ తెరదించాడు. IPL మ్యాచ్‌ల విరామ సమయంలో లండన్ వెళ్లిరావడానికి ప్రత్యేక విమాన సౌకర్యం కల్పించాలని కోహ్లీ RCB యాజమాన్యాన్ని కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ను కోహ్లీ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. దానికి రెండు నవ్వుతున్న ఎమోజీలను జతచేశాడు. దీంతో ఆ వార్తలన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశాడు.