NDL: బెలుం నుంచి కొలిమిగుండ్ల వైపు మట్టి లోడుతో వెళ్తున్న లారీ బుధవారం హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అదృష్టవశాత్తు గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి దర్యాప్తు ప్రారంభించారు.