ప్రకాశం: కంభంలోని మల్లికార్జున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను జిల్లా వైద్య శాఖ అధికారి శ్రీవాణి, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉషారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్చి 13న కాలం చెల్లిన సిరప్‌ను ఆసుపత్రి యాజమాన్యం నిర్వహిస్తున్న మెడికల్ షాపులో విక్రయించిన కారణంగా ఓ చిన్నారి అనారోగ్యానికి గురైంది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించామన్నారు.