పాక్ ప్లేయర్లు PSLను IPLతో పోలుస్తూ ఉంటారు. అయితే, RCB (రూ.16,700 కోట్లు), RR (రూ.15,290 కోట్లు) వంటి ఒక్కో IPL జట్టు విలువ వేల కోట్లలో ఉంది. PSL లీగ్ మొత్తం విలువ కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే. దీంతో భారత నెటిజన్లు, కేవలం ఒక్క IPL జట్టును అమ్మితే పాక్ క్రికెట్ బోర్డు(రూ.450-580 కోట్లు)తో పాటు వారి మొత్తం లీగ్‌ను కూడా కొనుగోలు చేయవచ్చని కామెంట్లు చేస్తున్నారు.