పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బయట విక్రయించే ప్యాక్ చేసిన జ్యూస్ల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యలకు దారితీయవచ్చు. పండ్లను రసంగా తాగడం కంటే, పండ్లను అలాగే తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఇవి ఊబకాయం, డయాబెటిస్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.