NTR: జగ్గయ్యపేట కృష్ణ ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీ ఆవరణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ ఛైర్మన్ రఘురాం పాల్గొని నూతన సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. భవనంలో చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలించి, రైతులకు సేవలందించేందుకు చేపట్టిన చర్యలకు గాను అభినందించారు. చివరిగా సభ్యులకు డివిడెంట్లను అందజేశారు.