IPL-2026 ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొత్తం 10 జట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోలు దిగారు. అయ్యర్ (PBKS), గిల్ (GT), పంత్ (LSG), రుతురాజ్ (CSK), అక్షర్ పటేల్ (DC), పటీదార్ (RCB), రహానే (KKR), పాండ్యా (MI), ఇషాన్ కిషన్ (SRH), పరాగ్ (RR) తమ తమ జట్లకు సారథ్యం వహిస్తున్నారు. IPL చరిత్రలో తొలిసారిగా అన్ని జట్లకూ భారత ఆటగాళ్లే కెప్టెన్లుగా వ్యవహరిస్తుండటం విశేషం.