NRPT: కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) రాష్ట్ర ప్రథమ మహాసభలో బుధవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నారాయణపేట జిల్లా వాసి ఏం. కృష్ణ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.