AP: బీసీ హాస్టళ్లపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సవిత అన్నారు. మరో రెండు నెలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని తెలిపారు. ఈలోగా హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాలు, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలోకి దోమలు రాకుండా దోమల నెట్లు కిటికీలు, ద్వారాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు.