AP: సోలార్ దరఖాస్తుల్లో పల్నాడు(D) 1.62 లక్షల అప్లికేషన్లతో రాష్ట్రంలోనే టాప్లో నిలిచింది. కానీ అమల్లో మాత్రం గుంటూరు(7,767), ఏలూరు ముందంజలో ఉన్నాయి. పల్నాడులో దరఖాస్తులు ఎక్కువగా ఉన్నా, ఇన్స్టలేషన్లు కేవలం 2.27% మాత్రమే జరిగాయి. టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి శ్రీపాద యశోనాయక్ లోక్సభలో ఈ గణాంకాలను వివరించారు.