AP: రాష్ట్రంలోని 21 జిల్లాలకు 1,162.80 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపుసెట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి శ్రీపాద యశోనాయక్ వెల్లడించారు. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాకు 221 మెగావాట్ల సామర్థ్యం గల పంపుసెట్లు కేటాయించినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు అత్యల్పంగా 9.33 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపుసెట్లే కేటాయించినట్లు చెప్పారు.