NRML: నర్సాపూర్ (జి) మార్కెట్లో తప్పిపోయిన 4 ఏళ్ల బాలుడిని బుధవారం మహిళా పోలీసులు షహన బాను, వినితలు గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి సంరక్షించారు. అనంతరం బాలుడి తల్లిని గుర్తించి సురక్షితంగా అప్పగించారు. అప్రమత్తంగా వ్యవహరించిన మహిళా పోలీసులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.