భారత జట్టులోకి పునరాగమనం చేయడం కోసమే తాను ఇంతలా కష్టపడుతున్నానని పృథ్వీ షా స్పష్టం చేశాడు. ‘గతంలో కంటే ఇప్పుడు మూడు రెట్లు ఎక్కువ శ్రమిస్తున్నాను. జట్టులోకి తిరిగి రావడానికి 200 శాతం కష్టపడుతున్నాను. నా తప్పులేమిటో నాకు తెలుసు. వాటిని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మనకు మనమే అర్థం చేసుకుని ముందుకు సాగాలి’ అని వ్యాఖ్యానించాడు.