JN: బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామంలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు గణపతి పూజ,పుణ్యాహవచనం,అఖండ దీపారాధన,రక్షాబంధనం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకం,మంటపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.