ASR: కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా మార్చాలని సీఐటీయూ జిల్లా నేత పాంగి ధనుంజయ్ కోరారు. ఈ మేరకు ఈనెల 5వ తేదీన సీఐటీయూ ఆధ్వర్యంలో “హలో సీహెచ్ డబ్ల్యూవో-చలో పాడేరు” పేరిట ఐటీడీఏ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామన్నారు. సీహెచ్ డబ్ల్యూలతో కలిసి తాజంగి పీహెచ్సీ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఆశాలతో సమానంగా సీహెచ్ డబ్ల్యూలు కూడా పని చేస్తున్నామన్నారు.