అమర్నాథ్ యాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. యాత్రకు నెల రోజుల ముందు నుంచే అధికారులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అనంతనాగ్ జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. శాంతియుతంగా యాత్ర సాగేలా పక్కా ప్లాన్ చేశారు. ఆగస్టు 28 వరకు యాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఆర్మీ, CRPF, J&K పోలీసులు నిఘా ఉంచారు. ప్రతి యాత్రికుడికి RFID ట్యాగ్ అమర్చుతారు.