AKP: పాయకరావుపేట జడ్పీ బాలికల హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని షేక్ ఆస్మా జాతీయస్థాయి జూడో పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం భవాని మంగళవారం తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లో ఈనెల పది నుంచి 13వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి జూడో ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్లు తెలిపారు.