కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ వాహనం పార్కింగ్ చేసే ప్రాంతంలో మద్యం సీసాలు, చిప్స్ ప్యాకెట్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. నిన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైన పలువురు సందర్శకులు ఈ దృశ్యాలను గమనించారు. గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగి ఖాళీ సీసాలు, ఇతర వ్యర్థాలను అక్కడే వదిలి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.