AKP: నాతవరం మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 9వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం.సత్య శ్రీనివాసు బుధవారం తెలిపారు. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందన్నారు. కావున మండలంలోని ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.