TG: తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపామని, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని KTR అన్నారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ సాధించామన్నారు. స్వరాష్ట్రం ఏర్పడితే HYD నుంచి పెట్టుబడులు, పరిశ్రమలు పోతాయని అపోహలు సృష్టించారని, పెట్టుబడుల సాధనలో బెంగళూరును అధిగమించామన్నారు.