NLR: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును బుధవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయగిరిలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు.