SRPT: సూర్యాపేట నుంచి మహబూబాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. మహిళలు, విద్యార్థులు ఫుట్బోర్డులపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రద్దీ సమయాల్లో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.