PPM: మక్కువ మండల కేంద్రంలోని కూరాకుల వీధి శివారులో రహదారి పక్కన చెత్త కుప్పలు పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారి పొడవునా వ్యర్థాలు ఉండటంతో దుర్వాసన వెదజల్లుతుంది. ఈ మార్గంలో ప్రయాణించే వారు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.