GNTR: పొన్నూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.కోటి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల తెలిపారు. ఈ నిధులతో చెబ్రోలు, పెదకాకాని, దేవరాయబొట్లపాలెంలకు రూ.25 లక్షల చొప్పున.. నంబూరు, వెనిగండ్లకు రూ.10 లక్షల చొప్పున, తక్కెళ్లపాడుకు రూ.5 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.