అన్నమయ్య: రాయచోటి పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు అర్బన్ పోలీసులు గంజాయి నిర్మూలనపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం కొంతమంది యువతకు గంజాయి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ చలపతి మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి వినియోగం ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు.