PLD: చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన టింకరింగ్ కార్మికుడు షేక్ జాకీర్ హుస్సేన్ (46) వేలూరు-జాలాది రోడ్డు పక్కన ఒంటిపై గాయాలతో శవమై కనిపించడం కలకలం రేపింది. జూన్ 1న పనికి వెళ్లిన ఆయన మంగళవారం మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. భార్య సఫియా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు.. ఇది హత్యనా లేక ప్రమాదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.