ATP: తుంగభద్ర డ్యామ్ ఛైర్మన్ ఎస్.ఎన్. పాండే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తుంగభద్ర డ్యామ్ మరమ్మతులు, కొత్త గేట్ల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన చొరవకు ఈ సందర్భంగా మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డ్యామ్ భద్రత, ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని పాండే అభినందించారు.