కోనసీమ: అమలాపురం మండలం సాకుర్రు గున్నేపల్లి కృష్ణుడు గుడికి సమీపంలో మంగళవారం రాత్రి ఒక కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. కారులో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.