KMM: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో నిర్వహించే ‘నవనిర్మాణ సంకల్ప సభ’పై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మంగళవారం మండిపడ్డారు. ఇక్కడ సభలు పెడితే అవమానాలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెస్ కు ధికారమిచ్చి ప్రజలు మోసపోయారని అన్నారు. పవన్ తన సభలను ఆంధ్రాలోనే పెట్టుకోవాలని, తెలంగాణలో ఆయన పప్పులు ఉడకవన్నారు.