సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గం 5వ వార్డ్ టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ బోయ శ్యాపురం రాము తన పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో పార్టీ విజయానికి తాను, తన బృందం పూర్తి స్థాయిలో కృషి చేసినప్పటికీ, కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం లభించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణాలతోనే బూత్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.