HNK: హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రైడ్ ఇండియా అవార్డ్స్-2026 కార్యక్రమంలో హన్మకొండ నగరంలోని కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆర్ఎంవో డా. సనత్ రోషన్‌కు “ఇండియన్ ఐకానిక్ విజనరీ డాక్టర్” అవార్డు లభించింది. వైద్య రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రముఖ సినీ నటి హెబ్బా పటేల్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని వారు మంగళవారం అందుకున్నారు.