ADB: బోథ్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ప్రవేశం పొందిన ఆరవ తరగతి విద్యార్థుల జాబితాను పాఠశాలలో ప్రదర్శించినట్లు ప్రిన్సిపల్ అనురాధ మంగళవారం తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 7 వ తేదీలోపు సంబంధిత ధ్రువ పత్రాలతో పాఠశాలలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.