AP: రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ వ్యవహారానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఈ సమస్యలను ఎంతవరకు పరిష్కరిచగలరో అంతవరకు అక్కడే పూర్తి చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని వాటిని మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.