KRNL: కర్నూలు జిల్లాలో ఈ ఏడాది చేపల ఉత్పత్తి పెంపుదలకు నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సుంకేసుల డ్యాం వద్ద చేపల విత్తనోత్పత్తి కేంద్రాన్ని పరిశీలించిన ఆమె, ఉత్పత్తి సామర్థ్యం, హ్యాచింగ్ పూల్స్, ఆర్సీసీ ట్యాంకుల పనితీరును సమీక్షించారు.