MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిన్న జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్, ఏసీపీ వెంకటేశ్వర్ రావు వర్షాకాల సన్నద్ధత పనులను పరిశీలించారు. నీరు నిలిచే ప్రాంతాలు, డ్రైనేజీ సమస్యలను సమీక్షించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.