NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి నియోజకవర్గంలోని పలువురు క్రీడాకారులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో క్రీడాకారులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తామని ఆనాడు ఆమె వారికి హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం వారికి క్రికెట్ కిట్లను ఆమె పంపిణీ చేశారు.