BDK: విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని MEO ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఎర్రగుంట ఉన్నత పాఠశాలలో ‘ఎర్త్ అవర్’ సందర్భంగా ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఫ్యాన్లు, లైట్లు, కంప్యూటర్లను నిలిపివేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేటి రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు విద్యుత్ ఉపకరణాలు నిలిపివేయాలని కోరారు.