ప్రకాశం: రోడ్డు ప్రమాదాల నివారణ ద్విచక్ర వాహన దారుల ప్రాణ రక్షణ రోడ్డు భద్రతలపై టంగుటూరు టోల్ ప్లాజాలోని సిబ్బందికి హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం మంగళవారం ఎస్సై నాగమల్లేశ్వరరావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యత హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రమాద సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా కాపాడుతుందో సిబ్బందికి వివరించారు.