E.G: దేవరపల్లి మండలం త్యాజంపూడి ఆవ చెరువులో అనుమతులు లేకుండా కొంతమంది ఆక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. దీంతో గ్రామంలోని యువకులు మంగళవారం అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. మట్టిని తరలిస్తున్న ట్రక్కులను డంప్ చేయించి, ట్రాక్టర్లను వెనక్కి పంపించారు. మట్టి బకాసురులపై చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.