VZM: నెల్లిమర్లలో నిర్మించే తాగునీటి పథకానికి మంగళవారం సాయంత్రం స్థానిక MLA లోకం నాగ మాధవి రూ.46 కోట్లతో భూమి పూజ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా స్థానిక 23 వార్డులకు పుష్కలంగా తాగునీరు అందిస్తామని, కొత్తగా ట్యాంకులు, పైప్లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. రెండు కాలనీలకు అమృత్ పథకం ద్వారా ప్రత్యేక పథకాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.