మెదక్: ఈనెల 4, 6, 8, 10 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు, మున్సిపల్ వార్డు సభలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ, పర్యావరణ వారోత్సవాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సమీక్ష నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలు విజయవంతం చేయాలని సూచించారు.