ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీకాయల ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత మే 13న టన్ను రూ.50 వేలు ఉండగా.. ప్రస్తుతం గరిష్ఠంగా రూ.60 వేలకు చేరింది. రెండేళ్ల కాలంలో ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి. మంగళవారం మార్కెట్కు 530 టన్నుల కాయలు రాగా.. కనిష్ఠ ధర రూ.18 వేలు, మధ్యస్థ ధర రూ.30 వేలుగా నమోదైంది.