‘రాజాసాబ్’ తర్వాత దర్శకుడు మారుతి తన తదుపరి సినిమాపై అప్డేట్ ఇచ్చాడు. ఈ మూవీ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉందని, దీనికి శ్రీరాముడి ఆశీస్సులు ఉన్నాయని తెలిపాడు. అయితే మారుతి ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్‌తో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. మారుతి మార్క్ కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది ఉండనుందట. ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించనున్నట్లు టాక్.