AP: 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు అన్నారు. నిర్మాణ పనులకు నిధుల కొరత లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలు కలిసి ఎలా పని చేయాలన్న అంశంపై ప్రణాళిక ఇచ్చామన్నారు. దాదాపు అన్ని డిజైన్లకు క్లియరెన్స్ ఇచ్చామని.. ఒకటి రెండు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. పనులు వేగంగా, నాణ్యతతో జరిగేలా సూచనలు చేశానన్నారు.