KMM: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య బూత్ లెవల్ ఆఫీసర్లకు (BLOs) నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా తయారీలో ఖచ్చితత్వం, పారదర్శకత అత్యంత ముఖ్యమని చెప్పారు. ప్రతి ఇంటిని పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు.