AP: ప.గో జిల్లా ప్రజాప్రతినిధులతో CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి, కలెక్టర్, SP పాల్గొన్నారు. పనితీరు, వ్యవహారశైలి, అందుబాటులో ఉండటంపై పనితీరు నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ పథకాల అమల్లో ఏ మాత్రం ఇబ్బంది రాకుండా చూడాలని సూచించారు. పలు అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చారు. తణుకులో రూ.28 కోట్లతో విజయవాడ-విశాఖ రోడ్డు మరమ్మత్తులకు ఆమోదం తెలిపారు.