AKP: జిల్లాలో రైతులు ఈనెల 29వ తేదీలోగా రైతు సేవా కేంద్రాల్లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని విక్రయించాలని జేసీ సౌర్యమాన్ పటేల్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు 65 రైతు సేవా కేంద్రాల ద్వారా 70.946 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 21,162 మంది రైతులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు.