TG: HYDలోని అత్తాపూర్‌లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టు రట్టయింది. 70 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడం కోసం నిందితులు శాంటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, వెల్లుల్లి పొట్టును కలిపి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నారు.